చైనాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. బస్సుల పరిమాణం వల్ల వెనుక వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ లైట్లు కనిపించవు. ఈ సమస్యను తీరుస్తూ బస్సుల వెనుక భాగంలో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డుపై ఉండే రియల్ టైమ్ సిగ్నల్స్‌ను ప్రదర్శిస్తాయి. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ వీడియో వైరల్ కావడంతో, భారత్‌లో కూడా ఇలాంటివి ప్రవేశపెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.