భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ పదో వార్డులో ఎన్నికల గిఫ్ట్‌ల రచ్చ నడిరోడ్డుపైకి చేరింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున కొందరు వ్యక్తులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నగదుతో పాటు కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత సీన్ రివర్స్ అయింది. తాము ఓడతామనే అనుమానంతో గిఫ్ట్‌లు పంచిన వ్యక్తులు తిరిగి ఇళ్లకు వచ్చి.. తమకు ఓటు వేయకుండా కుక్కర్లు ఎందుకు తీసుకున్నారంటూ కాలనీవాసులను వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన మహిళలు తమకు ఇచ్చిన కుక్కర్ల బాక్సులపై పేర్లు రాసి, వాటిని రోడ్డుపై పడవేసి నిరసన తెలిపారు. అసలు కౌంటింగ్ కూడా జరగకుండా తాము ఓటు వేయలేదని ఎలా అంటారంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు