చైనాలోని షాంఘై నగరం భారీ సింక్హోల్తో వణికిపోయింది. మిన్హాంగ్ జిల్లాలో మెట్రో పనులు జరుగుతుండగా.. ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిలా మారింది. భూగర్భ పనుల్లో తలెత్తిన లోపమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.