హైదరాబాద్లోని న్యూ మలక్పేట్లో ఊహించని సంఘటన జరిగొంది. ఉన్నట్లుండి రోడ్డు ఒక్కసారిగా కుంగింది. లాల్జార్ హోటల్ సమీపంలో మట్టితో పూడ్చిన రోడ్ ప్యాచ్ అకస్మాత్తుగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. లోడ్ ట్రాక్టర్ వెళ్లిన కొద్దీ సేపటికి రోడ్డుపై భారీ గుంత పడిందని స్థానికులు చెప్తున్నారు. దాంతో.. వెంటనే డబీర్పురా పోలీసులు, మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంత చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.