మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో చీరల షాపు భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో తొక్కిసలాట జరిగింది. రూ. 5,000 విలువైన చీరలు రూ. 599 కే లభిస్తాయన్న సోషల్ మీడియా ప్రచారంతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ రద్దీలో ముగ్గురు మహిళలు స్పృహతప్పగా, పలువురు పిల్లలు తల్లుల నుంచి వేరుపడ్డారు. సరైన ఏర్పాట్లు లేకుండా కస్టమర్లను ఆకర్షించినందుకు దుకాణ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.