ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న వీధి బండిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బండ్ల వ్యాపారి సుమారు 20 మీటర్ల దూరం గాలిలోకి ఎగిరిపడి, తీవ్రంగా గాయపడ్డారు.