ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులకు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వధువు మంటపంలోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఫొటోగ్రాఫర్ ఆమెను వీడియో తీస్తున్నాడు. వీడియో తీసే క్రమంలో వెనక్కు నడవాల్సి వచ్చింది. అయితే అక్కడే ఉన్న వాటర్ ఫౌంటెన్ను అతను గమనించలేదు. వీడియో తీస్తూ, ఒక్కో అడుగు వెనక్కు వేసుకుంటూ వచ్చాడు.