ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని చౌటపాలెం రోడ్డులోని గౌతమి స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. విండో తలుపు పగలగొట్టాడనే కారణంతో.. స్కూల్ ప్రిన్సిపల్ కేశవరెడ్డి విచక్షణారహితంగా కొట్టారు. నీ సంగతి తెలుస్తానంటూ ప్రిన్సిపాల్ బెదిరించడంతో భయపడిపోయిన సదరు విద్యార్థి.. తెల్లారేసరికి హాస్టల్ నుంచి పారిపోయాడు. తమ పిల్లాడు ఎక్కడని నిలదీయగా.. నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పొదిలి మండలం కాటోరిపాలెం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థిని గుర్తించి తీసుకువచ్చి.. స్కూల్ ప్రిన్సిపల్‌పై దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.