హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబా జిల్లాలో గడ్డకట్టించే చలిలోనూ ఒక కుక్క తన యజమాని మృతదేహానికి నాలుగు రోజుల పాటు కాపలా కాసింది. అత్యవసర పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తి చలికి తట్టుకోలేక మృతి చెందగా, అతనితోపాటే ఉన్న కుక్క అక్కడి నుంచి కదలలేదు. ఏం తినకుండా, చలిగాలులను ఎదుర్కొంటూ బాడీని అడవి జంతువుల నుంచి కాపాడింది.