సెల్ఫీ పిచ్చి పెళ్లి వేడుకలో చిచ్చు పెట్టింది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఓ వరుడు పదే పదే సెల్ఫీలు దిగుతోందన్న కోపంతో పెళ్లి పీటలపైనే వధువును కాలితో తన్నాడు. అడ్డువచ్చిన వధువు తండ్రిపై కూడా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆగ్రహించిన వధువు తరపు వారు కుర్చీలతో వరుడి బంధువులపై దాడి చేయడంతో పెళ్లి వేదిక కాస్తా రణరంగంగా మారింది