అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్యక్రమంలో 'ఆదర్శ కళానిలయం' సంస్థ ఆయనకు ప్రతిష్టాత్మక 'స్వర్ణనంది' అవార్డును ప్రధానం చేసింది. ఉచిత వైద్య శిబిరాలు, అన్నదానం ,పేదలకు ఆర్థిక సాయం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవకు గాను సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని డాక్టర్ సత్యారావు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.