చింతలపూడిలో గత ఏడాది అక్టోబర్ 9న కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడు నుంచి 2 కోట్ల 50 లక్షల విలువ చేసి 4కేజీలకు పైగా బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. రికవరీ చేసిన బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ 7కోట్ల ఉంటుందని జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ వెల్లడించారు. అదే గోల్డ్ ఫైనాన్స్‌లో ఆడిట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న వడ్లమూడి ఉమా మహేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన మహేష్ ఆడిటింగ్ పూర్తయిన తర్వాత క్యాషియర్‌ను బయటకు పంపించి, మొత్తం బంగారంతో పరారయ్యాడని తెలిపారు.ఫైనాన్స్ కంపెనీ యజమానులకు, నిందితుడికి మధ్య ఉన్న వివాదాల కారణంగానే మహేష్ ఈ దొంగతనం చేసినట్టు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.