హార్దిక్ ప్రేయసి మహీకాపై ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిన్న SAతో మ్యాచ్ సందర్భంగా పాండ్య 18 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అవ్వగానే స్టేడియంలో ఉన్న మహీకా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఔట్ అయితే చప్పట్లు కొట్టడమేంటని నెట్టింట మండిపడుతున్నారు. అయితే బంతి బౌండరీ వద్దకు వెళ్లడంతో ఆమె సిక్స్ అనుకున్నారేమోనని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.