నల్లగొండ రైల్వే స్టేషన్లో పారిశుధ్యం పడకేసింది. వారం రోజులుగా చెత్తాచెదారం పేరుకుపోయి స్టేషన్ ఆవరణ అంతా దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్య పనుల టెండర్ గడువు ముగియడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి, ఇక టాయిలెట్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్టేషన్లో శుభ్రత పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.