మొగల్తూరు మండలం కొండవారిపాలెంలో ఓ ఇంట్లో LG ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. ఇల్లంతా పొగలు వ్యాపించగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు, ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.