కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.