హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ తన 28వ నూతన స్టోర్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సెన్సేషన్, సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్లోని వివిధ విభాగాలను సందర్శించిన శ్రీలీల, అక్కడి లేటెస్ట్ కలెక్షన్లను పరిశీలించి సందడి చేశారు. అధునాతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను అందించడంలో మాంగళ్య మాల్ నంబర్ వన్ అని కొనియాడారు. ముఖ్యంగా కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు వెస్ట్రన్ కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.