మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఓ రైతు వినూత్న ఆలోచనతో కోతుల బెడదకు పరిష్కారం కనుగొన్నాడు. గ్రామంలో కోతుల ఆగడాలు మితిమీరిపోవడంతో, తన ఇంటిని, పంటను కాపాడుకోవడానికి సోమయ్య అనే రైతు ఏకంగా 20 వేల రూపాయలు వెచ్చించి ఓ కొండముచ్చును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కొండముచ్చు గార్ల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన వడ్ల రాసులకు కాపలాగా ఉంటోంది. కొండముచ్చును చూడగానే కోతులు పరుగులు తీస్తుండటంతో అటు రైతులకు, ఇటు మార్కెట్ సిబ్బందికి పెద్ద ఊరట లభించింది. సోమయ్య తన ద్విచక్ర వాహనంపై కొండముచ్చును ఎక్కించుకుని ఊరంతా తిరుగుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.