ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో శ్రీ కోదండ రామాలయ భూముల ఆక్రమణపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఇచ్చిన 6 ఎకరాల భూమిలో సగానికి పైగా ఇతరుల పరమవడమే కాకుండా, మిగిలిన చోట అనుమతి లేకుండా అక్రమంగా రోడ్లు నిర్మించడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని, వెంటనే సర్వే చేసి ఆలయ భూములను అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.