ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని పూర్తిగా పొగమంచు కమ్మేసింది. కొండపై ఎటు చూసినా మంచు తెరలు కనువిందు చేశాయి. పెద్ద ఎత్తున మంచు కురవడంతో కొండపై ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లన్నీ పూర్తిగా మంచులో మునిగిపోయాయి. స్వామి వారి దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ మంచులో తడుస్తూ గోవింద నామస్మరణల మధ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.