నాయకుల హామీలు నీటిమూటలవుతుంటే.. అడవి బిడ్డల బతుకులు ఆవిరవుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో రహదారి సౌకర్యం లేక, అనారోగ్యంతో ఉన్న ఛత్తీస్గఢ్ వలస కూలీ కుంజం మంగును తోటి కూలీలు మూడు కిలోమీటర్ల మేర జోలె కట్టి మోసుకెళ్లారు. గోదావరి నది పాయల్లో తాత్కాలిక నివాసాలు ఉంటున్న వీరిని, పని చేయించుకుంటున్న యజమానులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. చివరకు 108 వాహనం ద్వారా బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీల చెంతకు చేరని అభివృద్ధికి ఈ డోలీ ప్రయాణమే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.