న్యూఇయర్ రోజున అమెరికాలో ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. రోడ్ ఐలాండ్లో ఫినిక్స్ అనే లాబ్రడార్ కుక్క చెరువుపై ఉన్న పల్చని మంచు పొరపై నడుస్తూ నీటిలో పడిపోయింది. గడ్డకట్టే చలిలో చిక్కుకున్న ఆ కుక్కను ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. 2026లో ఇది తమ మొదటి ‘సక్సెస్ఫుల్ కాల్’ అని అధికారులు పేర్కొన్నారు. నీటిపై ఉండే మంచు ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.