గద్వాల బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఆ కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గద్వాల, గట్టు క్లస్టర్లకు చెందిన 408 మంది చేనేత కార్మికులకు ఆయన చేనేత పరికరాలను పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత వృత్తి కనుమరుగు కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నేతన్నలు ఆధునిక పరికరాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.