వైకల్యాన్ని సాకుగా చూపకుండా, ఒక చేయి లేకపోయినా తన బిడ్డల ఆకలి తీర్చేందుకు శ్రమిస్తున్న ఒక తండ్రి పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టాల్లో కుంగిపోకుండా ఆయన పడుతున్న శ్రమ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. సాకులు వెతుక్కునే వారు ఈయనను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు భావోద్వేగంతో కొనియాడుతున్నారు. నిరంతర కృషికి, ఆత్మవిశ్వాసానికి ఈ తండ్రి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.