వైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని ఒక అసాధారణ కళాకారుడు నిరూపిస్తున్నాడు. సగం చేతితో డోలు వాయిస్తూ కాలుతో చిడతల లయను జోడిస్తూ ఆయన సాగిస్తున్న సంగీత ప్రయాణం నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. పిల్లనగ్రోవి నాదంతో అద్భుతాలు సృష్టిస్తున్న ఈయన పట్టుదలకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే, ఇంతటి అమోఘమైన ప్రతిభ ఉన్న వ్యక్తి జీవనోపాధి కోసం భిక్షాటన చేయడం కలచివేస్తోంది. ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల్లో కోరుతున్నారు.