మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సంప్రదాయబద్ధంగా జరిగిన 'మహర్షి మైత్రి క్రికెట్ టోర్నమెంట్' నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణ జెర్సీలకు భిన్నంగా వేద పండితులు, విద్యార్థులు ధోతీ-కుర్తాలు ధరించి మైదానంలో మెరిశారు. ఈ టోర్నీ ప్రత్యేకత ఏమిటంటే, మ్యాచ్ కామెంట్రీ మొత్తం సంస్కృతంలో సాగింది. సంస్కృత భాషను, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వినూత్న క్రీడా పోటీలను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.