ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు పాదయాత్రగా స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2002 నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి పాదయాత్రగా వస్తామని.., భీష్మ ఏకాదశి రోజున స్వామిని దర్శిస్తే అందరికీ ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తులు చెబుతున్నారు.