భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో అధిక సంఖ్యలో భక్తులు భద్రాచలం రాముని దర్శించుకుంటున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తజనంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.