శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రంలో సిబ్బంది.. సినిమా పాటలతో నిబంధనలకు విరుద్దంగా డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దేవాలయాల పరిధిలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించకుడదనే నిభందనలను.. సత్రం సిబ్బంది తుంగలో తొక్కి వికృత చేష్టలతో నృత్యాలు చేస్తూ వేడుకలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా డాన్సులు వేయడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. ఇంత పెద్ద క్షేత్రంలో నిఘా నేత్రాలు ఉన్నా.. కొందరు వ్యక్తులు బరితెగించి ఐటమ్ సాంగ్స్‌కు డాన్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.