సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంకేపల్లి గ్రామ కొత్త చెరువులో మొసళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. చెరువులో సుమారు మూడు మొసళ్లు సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.