ఫోటో షూట్ కోసం శ్రీవారి ఆలయం వద్ద నూతన వధువరులు చేసిన పనులను చూసి భక్తులు విస్తుపొయారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి మరీ.. ఓ జంట శ్రీవారి ఆలయం వద్ద ఫోటో షూట్ చేసింది. నలుగురు ఫొటో, వీడియో గ్రాఫర్లతో ఫొటోలు తీస్తూ ఆలయం వద్ద హడావుడి చేసినా.. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. ఆలయానికి ఎదురుగానే ఫోటో షూట్ కోసం ఈ జంట చేసిన పనులను చూసి భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఇలా ఫోటో షూట్ చేసిన వారిపై కేసు పెట్టిన టీటీడీ అధికారులు.. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడలని భక్తులు అంటున్నారు.