ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఎన్టీఆర్ కుటుంబం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మొబైల్ వాహనంలోని అత్యాధునిక మమ్మోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఖరీదైన వైద్యం చేరువ చేయాలన్న నందమూరి బాలకృష్ణ సంకల్పం గొప్పదని కొనియాడారు.