నేపాల్‌లోని భద్రాపూర్లో బుద్ధ ఎయిర్‌కు చెందిన ATR 72 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఖాట్మండు నుండి వచ్చిన ఈ విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. రన్‌వే దాటి 200 మీటర్ల దూరం వెళ్లిన విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. నేపాల్‌లో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.