మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఒక వింత వంకాయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టణానికి చెందిన కోడి వెంకటేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో నాటిన మొక్కకు ఏకంగా 15 అంగుళాల పొడవు గల వంకాయలు కాస్తున్నాయి. సాధారణంగా వంకాయలు 2 నుండి 8 అంగుళాల పొడవు ఉంటాయని, కానీ ఇక్కడ కాసిన వంకాయలు ఒక్కొక్కటి కిలోకు పైగా బరువు ఉండటంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. చూడటానికి పొట్లకాయలను తలపిస్తున్న ఈ భారీ వంకాయలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నాయి.