అనంతపురం జిల్లా కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ అడిషనల్ మెజిస్ట్రేట్లకు ఈ మెయిల్ అందడంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణం నుండి ప్రజలను, సిబ్బందిని బయటకు పంపించివేశారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ కోర్టులోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రస్తుతం కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించి, ఈ బెదిరింపు వెనుక ఉన్న నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.