రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్ గూడ డివిజన్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా డాక్టర్లు, నేతలు, సామాన్య ప్రజలు కలిసి నిర్వహించిన ఈ ర్యాలీలో.. మద్యపానం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని నినదించారు. క్యాన్సర్ ముందస్తు నివారణకు వ్యాయామం, యోగా, పోషకాహారం తప్పనిసరని, వ్యాధి సోకిన వారు మనోధైర్యంతో పోరాడాలని వైద్యులు పిలుపునిచ్చారు. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే క్యాన్సర్‌ను జయించవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.