మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ పోలీసులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీలో స్వయంగా ఎస్పీ హెల్మెట్ ధరించి పోలీస్ సిబ్బందితో కలిసి నగర వీధుల్లో పర్యటించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.