రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి చౌరస్తా వద్ద ఆటో యూనియన్ బంద్ పిలుపు మేరకు.. కొంతమంది ఆటో డ్రైవర్లు హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఆటోలను అడ్డగించి, వాటిలో ప్రయాణిస్తున్న వారిని బలవంతంగా దింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఆటో కార్మికులు చేపట్టిన బంద్ కొనసాగుతున్న సమయంలో ఆటోలు నడపవద్దని వెళ్తున్న డ్రైవర్లను హెచ్చరించారు. ఈ క్రమంలో కొంతమంది ఆటోలను అడ్డగించి తాళాలు లాక్కున్నట్లు కొంతమంది ఆటో డ్రైవర్ల ఆరోపించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.