శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కుర్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ అధికారులు.. వన్య ప్రాణుల వేటగాళ్ల ఆట కట్టించారు. పక్కా సమాచారంతో కదిరి ఫారెస్ట్ రేంజర్ గుర్రప్ప ఆధ్వర్యంలో వేటగాళ్ల స్థావరాలపై అధికారులు మెరుపుదాడులు చేసి వేటగాళ్ళను పట్టుకున్నారు. ఘటన స్థలంలోనే ముగ్గురు వేటగాళ్లను పట్టుకోగా.. పారిపోయిన మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారి నుంచి మూడు నాటు తుపాకులు, 25 బుల్లెట్లు, రెండు కత్తులు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లు అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.