సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఓవర్‌నైట్‌లో స్టార్ అవ్వాలన్న అత్యాశతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరి కొంతమంది సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్ కోసం దారుణమైన పని చేశాడు. చిన్న పిల్లాడికి సిగరెట్, మందు తాగించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.