సూర్యాపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి లక్ష్మి శారద, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహలతో కలిసి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని, బాధితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు భారీగా పాల్గొని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.