తెలంగాణలో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చేలా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక కారణాల వల్ల హాట్ హెయిర్ బెలూన్ను అత్యవసరంగా నార్సింగి సర్కిల్ మణికొండ నిక్నాపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద దించాల్సి వచ్చింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, బెలూన్లో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు.