వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో 102 ఏళ్ల వృద్ధురాలు జహీరాబీ.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన మనవళ్లతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధురాలు ఓటు వేశారు. తనకు 102 సంవత్సరాలు నిండాయని.. మొదట వేసిన ఓటు గుర్తులేదని 102 ఏళ్ల భామ జహీరాబీ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.