హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షేర్ మాల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మాల్‌ను సందర్శించడానికి వచ్చిన వినియోగదారులపై అకస్మాత్తుగా సీలింగ్ బోర్డులు కుప్పకూలాయి. ఆదివారం కావడంతో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.