విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. రుషికొండ బీచ్ సమీపంలో.. సముద్రంలో 77 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేశారు. లెవిన్ అడ్వెంచర్స్ టీమ్‌కు చెందిన వారు నీటిలో గుర్రంపై సవారీ చేస్తున్నట్లుగా, చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. ఇది ధైర్యం, క్రమశిక్షణ, రాజ్యాంగంపై గౌరవానికి ప్రతీకగా నిలిచింది. రుషికొండ, తిమ్మాపురంలో రెండు బృందాలు సముద్ర గర్భంలో జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించడంతో పాటు విశాఖను అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రంగా మరోసారి నిలిపింది.