సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లలో ఓ ఇంటి యజమాని చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశమైంది. తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిరంతరం చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడమే కాకుండా, వాటిని తగలబెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ప్లకార్డు పట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ చెత్త కుప్పల వద్దే బైటాయించి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇంటి వద్ద చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.