నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మతసామరస్యానికి ప్రతీకగా ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎత్తం గట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా... జనసేన నేత ఎండీ. ఖాదర్ పాషా గత ఆరేళ్లుగా తన సొంత ఖర్చులతో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, కులమతాలకు అతీతంగా సుమారు మూడు వేల అడుగుల ఎత్తున వెలిసిన ఈ క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల కడుపు నింపుతున్నారు. ఆధ్యాత్మికతతో విరాజిల్లుతున్న ఈ ఎత్తం గట్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఖాదర్ పాషా కోరారు.