మెదక్ జిల్లా రామాయంపేటలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి పరీక్ష రాసేందుకు వచ్చిన రేవతి అనే విద్యార్థిని.... పరీక్ష హాల్లోనే స్పృహ తప్పి పడిపోయింది. ఇది గమనించిన కళాశాల యాజమాన్యం వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వైద్య సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పరీక్షా కేంద్రానికి చేరుకుని విద్యార్థినికి ప్రాథమిక చికిత్స అందించారు. ఎండల తీవ్రత, పరీక్ష ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.