పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంగారం కోడిపుంజు వీడియోలు వైరల్గా మారాయి. సంక్రాంతి సందర్భంగా భీమవరంలో జరిగిన కోడిపందాల బరిలో.. ఒకేసారి ఆరు పుంజుల పందెం నెగ్గిన కోడిపుంజుకి బంగారపు చైన్ వేసి పందేంరాయుళ్లు ఊరేగించారు. ప్రస్తుతం ఆ కోడిపుంజుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.