మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు నూతన సంవత్సర వేళ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలమే నేటి మన స్వేచ్ఛ అని చాటిచెప్పేలా.. పట్టణంలోని అంబేద్కర్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, వాజ్‌పేయి విగ్రహాలకు పోలీస్ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఏటా రొటీన్‌గా వేడుకలు చేసుకోవడం కంటే, సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు డిఎస్పి తెలిపారు. ముఖ్యంగా యువత మన ఊరిలోని విగ్రహాలు ఎవరివి, వారి గొప్పతనం ఏంటి అన్నది తెలుసుకోవాలని.. తద్వారా మంచి సంస్కృతిని కాపాడుకుంటూ గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి నాంది పలకాలని డిఎస్పి రఘువీర్ విష్ణు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.